Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

నవంబర్‌ 1 నుంచి ఆరోగ్యశ్రీ .. కోలుకునేవరకు రోజుకు రూ. 225

YSR Aarogyasri From November 1 in AP

డిసెంబర్‌ 1 నుంచి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు కోలుకునేంత వరకూ నెలకు రూ.5వేల లేదా రోజుకు రూ.225 చొప్పున అందించేందుకు ఏర్పాట్లు చేయాలని జగన్‌ సూచించారు. ఆరోగ్యశ్రీలో డెంగ్యూతో పాటు ఇతర వ్యాధులను చేర్చాలని అధికారులను ఆదేశించారు. కిడ్నీ, తలసేమియా, హిమోఫిలీయా లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, కదలలేని స్థితిలో ఉండి కుర్చీకే పరిమితమైన వారికి సైతం నెలకు 10వేల రుపాయలను ఆర్ధిక సహాయం చేయాలని సూచించారు.

 

నవంబర్ నుంచి హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూర్ నగరాల్లోనూ ఏపీ ఆరోగ్యశ్రీ సేవలందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ కు 6 సూత్రాలతో ముందుకు సాగాలన్న సీఎం అన్ని జాతీయ రహదారుల్లో మద్యం దుకాణాలను తొలగించాలని ఆదేశించారు.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!