Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

హీరో రాజశేఖర్ కారు బోల్తా .. తప్పిన ప్రమాదం

సినీ నటుడు రాజశేఖర్ కారు (టీఎస్‌ 07 ఎఫ్‌జెడ్‌ 1234) ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఔటర్ రింగు రోడ్డు వద్ద బుధవారం తెల్లవారు జామున అదపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. అయితే కారులోని ఎయిర్‌ బెలూన్స్‌ తెరుచుకోవటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం తరువాత మరో కారులో రాజశేఖర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదని, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!