Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

తెరాస ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంటిపై ఐటీ దాడులు

టీఆర్ఎస్ పార్టీకి చెందిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇల్లు, కార్యాలయంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం పలు దఫాలుగా ఐటీ అధికారులు ఎమ్మెల్యే నివాసంలో తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం కూకట్‌పల్లి వెంకట్రావు నగర్ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో తనిఖీలు కొనసాగాయి.

 

కృష్ణారావు కుమారుడు సందీప్ రావుకు చెందిన ప్రణీత్ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రణీత్ హోమ్స్ వ్యవహారంలో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది. సంస్థ ఎండీ నరేందర్, మరో ఐదుమంది డైరెక్టర్ల నివాసాల్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. సోదాల సందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!