Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

ఐటీలో 40,000 ఉద్యోగాలు పోవచ్చు : ఐటీ రంగ నిపుణులు మోహన్‌దాస్ పాయ్

ఐటీ రంగ నిపుణులు, ఇన్ఫోసిస్‌ మాజీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ మోహన్‌దాస్ పాయ్ షాకింగ్ విషయం చెప్పారు. ఎకానమీ నెమ్మదించడం వల్ల మనదేశంలోని ఐటీ సేవల కంపెనీలు ఈ ఏడాదిలో ఐటీ కంపెనీలు దాదాపు 30వేల నుంచి 40 వేల మంది మధ్యశ్రేణి ఉద్యోగులను తొలగించే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే ఇలా ఉద్యోగాలు పోవడం అయిదేళ్లకోసారి సాధారణంగా జరిగే అంశమేనని ఆయన అన్నారు.

 

మంచి వృద్ధి నమోదు చేసినప్పుడు ప్రమోషన్లు సహజమేనని చెప్పారు. అయితే వృద్ధి తగ్గినప్పుడు మాత్రం ఆ ప్రభావం ఎక్కువగా మిడిల్ లెవల్ ఉద్యోగులపై ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అలాంటి ఉద్యోగులను తొలగించేందుకు కంపెనీలు మొగ్గు చూపుతాయన్నారు. అయితే ఇలా ఉద్యోగాలు పోగొట్టుకున్నా వారిలో తిరిగి 80 శాతం మందికి సాధారణంగానే ఉద్యోగావకాశాలు దోరుకుతాయని ఆయన చెప్పుకొచ్చారు.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!