Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

‘శీతాకాలంలో సీతాఫలం’.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో

ప్ర‌స్తుత సీజ‌న్‌లో మ‌న‌కు సీతాఫ‌లం ఎక్కువ‌గా దొరుకుతుందనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇది సీజ‌న‌ల్ ఫ్రూట్ కావడం చేత క‌చ్చితంగా దీన్ని అంద‌రూ తినాల్సిందే. సీతాఫ‌లంలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ఉంటాయి. దీంతోపాటు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి.

 

సీతాఫలం లో ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు శరీరానికి ముఖ్యంగా కావాల్సిన విటమిన్ సి కూడా వ్రుద్దిగా దొరుకుతుంది. అంతేకాదు గుండెని పదిలంగా కాపాడే పొటాషియం,మెగ్నీషియం కూడా అందిస్తుంది ఈ సీతాఫలం. అందుకు తగ్గట్టుగా తీయదనం కూడా ఉండటం వలన వీటికి ఈ కాలంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

 

చర్మాన్ని, జుట్టు ని ఆరోగ్యంగా ఉంచగల శక్తి సీతాఫలంలో ఉంటుంది అందుకు గాను ఇందులో ఏ విటమిన్ ఎంతో ఉపయోగపడుతుంది. కంటి చూపు మెరుగు పరచడంలో, జీర్ణ వ్యవస్థని గాడిన పెట్టడంలో ఈ ఫలాన్ని మించింది మరొకటి లేదనే చెప్పాలి. శరీరంలో నీటి స్థాయి తగ్గకుండా జాగ్రత్త చేస్తుంది. రక్త హీనతతో ఇబ్బందులు పడే వారు సీతాఫలం ఎక్కువగా తీసుకుంటే సమస్య తొలగిపోతుంది. అంతేకాదు షుగర్ లెవిల్స్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ సీతాఫలం.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!