Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

Facebook Pay :ఫేస్‌బుక్ నుంచి డబ్బులు పంపొచ్చు

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఆన్‌లైన్ చెల్లింపుల రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే గూగుల్, ఆపిల్ వంటి ఎన్నో సంస్థలు డిజిటల్ పేమెంట్స్‌లో దూసుకుపోతున్న సంగతి తెల్సిందే. తాజాగా ఫేస్‌బుక్ కూడా ఆ జబితాలో వచ్చి చేరింది. ఫేస్‌బుక్ పేను ప్రస్తుతానికి అమెరికాలో అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు సులువైన, సురక్షితమైన చెల్లింపులు జరపడానికి వీలుగా తాము ఈ సేవను ప్రారంభిస్తున్నామని ఫేస్‌బుక్ ప్రకటించింది.

 

దీనిని ఉపయోగించి కొనుగోళ్లు, చెల్లింపులతో పాటు విరాళాలు, నగదు లావాదేవీలను కూడా చేసుకోవచ్చని ఫేస్‌బుక్ పేర్కొంది. ఈ సేవలను ఫేస్‌బుక్‌లో మాత్రమే కాకుండా ఫేస్‌బుక్ అనుబంధ సంస్థలైన మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లలో కూడా వినియోగించుకోవచ్చని తెలిపింది.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!