Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

అమెరికాలో ఆవు పిడకల వ్యాపారం

మన దేశంలో అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలు ఆవు పిడకల అమ్మకాలను ఎప్పుడో ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో వీటికి డిమాండ్‌ పెరుగుతోంది. న్యూజెర్సీలోని ఓ షాప్‌ లో అవు పేడతో రూపొందించిన పిడకలు ప్యాకెట్లలో అమ్మకానికి పెట్టారు.

 

ఇది ఓ భారతీయ ఉత్పత్తి. ఇది తినే పదార్థం కాదు. మతపరమైన విషయాల్లో మాత్రమే దీన్ని ఉపయోగించాలి అని ప్యాకెట్‌ మీద ముద్రించి ఉంది. పది పిడకలు ఉన్న ఓ ప్యాకెట్‌ ధర మన రూపాయల్లో రూ.214 గా ఉంటుంది. స్థానికంగా నివసించే ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి దీన్ని ఫోటో తీసి తన బంధువుకు పంపించాడు. అనంతరం ఇది సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయబడి వైరల్‌ గా మారింది.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!