Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

పోలీసు అధికారులు పోస్టింగ్‌ల కోసం ఇలా చేస్తున్నారు : చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వం వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో చంద్రబాబు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, తననుంచి కార్యకర్తలను దూరం చేయాలన్న తలంపుతో పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు. తనకు నోటీసులు కూడా ఇచ్చారన్నారు. తనను కలిస్తే కేసులు పెడతామని హెచ్చరికలు కూడా జారీ చేశారని చెప్పారు.

 

మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేయడమే వారి లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. కొంతమంది పోలీసు అధికారులు లాలూచీ పడి, పోస్టింగ్‌ల కోసం ఇలా చేస్తున్నారు. చింతమనేనిపై పలు అక్రమ కేసులు పెట్టారన్నారు. సాక్షాత్తూ ఒక ఎస్పీ కేసులు పెట్టమని ప్రోత్సహిస్తే, శాంతి భద్రతలు ఎవరు పరిరక్షిస్తారు? నా భద్రతను సాకుగా చూపిస్తూ.. ఇతర కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ఆశా వర్కర్లను పరామర్శించిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పైనా కేసు పెట్టారని పేర్కొన్నారు.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!