Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

భక్తి కోటిదీపోత్సవం 2019 నవంబర్ 14

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో నవంబర్ 3 నుంచి 18వ తేదీ వరకూ జరనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ప్రతి రోజూ సాయంత్రం ఐదున్నర గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. నవంబర్ 3 నుంచి అంగరంగ వైభవంగా ఎన్టీవీ-కోటి దీపోత్సవంఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి, కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవీ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్నారు.

శ్రీ అలివేలు మంగ సర్వయ్య స్మార్ధ వేద పాఠశాల విద్యార్ధుల వేద పఠనంతో కోటి దీపోత్సవం ప్రారంభమైంది. డాక్టర్ శేషులత బృందంచే శ్రీ విష్ణు సహస్ర నామస్తోత్ర పారాయణం, నోరి నారాయణ మూర్తి ప్రవచనం, కొల్హపూర్ మహలక్ష్మీకి స్వాగతం, వేదికపై సింహద్రి అప్పన్నకు హరిచందన పూజ, చౌకిలపై విష్ణుమూర్తి విగ్రహాలకు భక్తులచే హరిచందన పూజ, సింహద్రి అప్పన్న కల్యాణోత్సవం నిర్వహించారు. పల్లకిపై సింహచలం ఉత్సవమూర్తులను ఊరేగించారు.

యోగ గురు బాబా రామ్ దేవ్ పాల్గొన్నారు. ప్రతాప్ చంద్ర సారంగి ,పశు సంవర్ధక ,సూక్ష్మ మద్యతరహ పరిశ్రమల శాఖ కేంద్ర సహయ మంత్రి, వై.సత్యకుమార్ ,జాతీయ కార్యదర్శి,బిజేపి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!