Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

ఇకనుంచి అద్దెకు ఐఫోన్లు.. సరికొత్త ఆఫర్ తో ఆపిల్

ఆపిల్ ఐఫోన్ వినియోగదారులకు శుభవార్త. పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించి ఇకపై ఐఫోన్లను కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా ఆపిల్ సంస్థ సరికొత్త ప్రణాళిక రూపొందించింది. ఇకమీదట ఐఫోన్లు అద్దెకు ఇవ్వాలని భావిస్తోంది. నెలకు కొంత మొత్తం చెల్లించి ఐఫోన్ ను వాడుకోవచ్చు. అలాగే కంపెనీ నుంచి కొత్త మోడల్ వస్తే పాత‌ ఫోన్ వెనక్కి ఇచ్చేసి కొత్త దాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఐఫోన్ ను అద్దెకు తీసుకున్నవాళ్లు ఐ ట్యూన్స్, ఐ క్లౌడ్ వంటి సేవలకు కూడా అదనంగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది. త్వరలోనే దీనికి సంబంధించి ఆపిల్ సంస్థ నుంచి ఓ ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!