Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

ఆమె తెలుగు ప్రసంగం చూశాక అందరూ ఔరా అనాల్సిందే

ఏఎన్నార్‌ పురస్కార ప్రదానోత్సవ వేడుకల్లో సినీ నటి రేఖ ప్రసంగం చూశాక అందరూ రేఖకి తెలుగు ఇంత బాగా వచ్చా.? అంటూ అంతా విస్తుపోయారు. సినీ నటి రేఖ మన తెలుగమ్మాయే. నటి రేఖ తల్లి పుష్పవల్లి తెలుగు నేలపై జన్మించారు.. పలు తెలుగు సినిమాల్లోనూ నటించారామె. రేఖ తండ్రి జెమినీ గణేశన్‌.

 

అలా రేఖకి తెలుగుతోపాటు, తమిళం కూడా బాగానే వచ్చు. తెలుగులో అనర్గళంగా రేఖ మాట్లాడేస్తోంటే అక్కడ ఉన్నవారంతా షాక్‌కి గురయ్యారనడం అతిశయోక్తి కాదేమో. కొన్ని కఠినమైన తెలుగు పదాల్ని ఆమె ఆలవోకగా మాట్లాడేశారు. రేఖ, బాలీవుడ్‌లో స్థిరపడి చాలా ఏళ్ళయ్యింది. ఆ లెక్కన ఆమెకి తెలుగులో మాట్లాడటం అంటే కొంత ఇబ్బందిగానే వుండొచ్చు.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!