Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

జొమోటోకు రూ. లక్ష జరిమానా విధించిన చెన్నై కార్పొరేషన్

Zomato fined Rs 1 lakh after Chennai office found to be breeding ground for mosquitoes

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు చెన్నై కార్పొరేషన్ అధికారులు లక్ష రూపాయల జరిమానా విధించారు. చెన్నైలోని చెట్‌పేట్‌ మెక్‌నికోల్స్ రోడ్‌లో అపరిశుభ్ర వాతావరణంలో జొమాటో సంస్థకు చెందిన బ్యాగులను గుర్తించిన చెన్నై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు జరిమానా విధించారు.

 

చెన్నైలో ఇటీవల డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో స్పందించిన అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అపరిశుభ్ర పరిసరాలను గుర్తించేందుకు ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతున్నారు. అపరిశుభ్రంగా కనిపించిన సంస్థలు, కార్యాలయాలకు కార్పొరేషన్ అధికారులు ఎక్కడికక్కడ జరిమానాలు విధిస్తున్నారు.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!