Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

జగన్ ప్రమాణ స్వీకారం ఖర్చు 29 లక్షలు కాదు, 5 కోట్లు అంట..!

YS Jagan Oath Cermony Expediture

జగన్ విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమం నిరాడంబరంగా జరిగిందని అప్పట్లో వార్తలు రావడం తెలిసిందే. టెంట్లు, వేదిక, రవాణా కోసం కేవలం రూ. 29 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టామని, చంద్రబాబు ప్రమాణ స్వీకారం కంటే ఇది చాలా తక్కువ అని వైకాపా శ్రేణులు ప్రచారం చేసుకున్నాయి. అయితే జగన్ ప్రమాణ స్వీకారం ఖర్చు 29 లక్షలు కాదని, ప్రకటనల కోసం కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది.

 

ఆ రోజు తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికల్లో ప్రకటన కోసం రూ. 5కోట్లు చెల్లించినట్లు చూపే డాక్యుమెంటు ఒకటి బయటికి వచ్చింది. జగన్ సొంత పత్రిక సాక్షికి దాదాపు రూ. 2 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చారు. ఈనాడుకు రూ. 99 లక్షలు, నమస్తే తెలంగాణకు రూ. 31 లక్షలు చెల్లించారు. టీడీపీ వాళ్ళు ఆర్టీఐ చట్టం కింద ఈ వివరాలు రాబట్టారు. పొదుపు చేస్తున్నట్లు బయటకి పోజులు కొట్టి సొంత పత్రికకు రూ. 2 కోట్లు సమర్పించుకున్న జగన్ దీనికి ఏ సమాధానం చెబుతారని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

Advertisements

 

error: నమస్కారం!