Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

వాట్సాప్ మరో అదిరిపోయే ఫీచర్.. వాట్సాప్ మెసేజ్‌లు అదృశ్యమైపోతాయి.

WhatsApp Working on Self-Destructing Messages Feature

ప్రముఖ మెసేంజరింగ్ సంస్థ వాట్సాప్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ త్వరలోనే తన యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. ఇప్పటి వరకు మెసేజ్‌లను మనం వద్దనుకుంటే మాత్రమే డిలిట్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఇకపై అందులో మనం పంపుకునే మెసేజ్‌లు నిర్ణీత సమయం (5 సెకన్ల నుంచి 1 గంట) వరకు మాత్రమే కనిపించి ఆ తరువాత వాటిని అదృశ్యమైపోయేలా చేయవచ్చు. అందుకుగాను వాట్సాప్‌లోని సెట్టింగ్స్ విభాగంలో అందజేసే డిసప్పియరింగ్ మెసేజెస్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉండగా, త్వరలోనే వాట్సాప్ యూజర్లందరికీ లభ్యం కానుంది.

error: నమస్కారం!