Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

Facebook : వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్ పేర్లు మార్చనున్న ఫేస్బుక్

WhatsApp-and-Instagram-Name-Change-by-Facebook

త్వరలో మనం వాడుతున్న వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్పేర్లు  మారబోతున్నాయి . ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో, కొత్త హంగులతో యూజర్లకు కొత్త అనుభూతిని అందిస్తున్న వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్  ఇప్పటి నుండి ‘వాట్సాప్ ఫ్రమ్ ఫేస్‌బుక్’  , ‘ఇన్‌స్టాగ్రామ్ ఫ్రమ్ ఫేస్‌బుక్‘  అని మారబోతున్నాయి . అయితే, కేవలం యాప్స్ పేర్లు మాత్రమే మారతాయట. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ఫీచర్స్ అన్నీ అలాగే ఉంటాయట.

 

వాస్తవానికి, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్   ఫేస్‌బుక్‌కు చెందినవే . కానీ ఆ విషయం చాలా మందికి తెలియదు. అందుకే  యాప్స్ పేరులో ఫేస్‌బుక్ చేర్చడం ద్వారా అవి ఫేస్‌బుక్ కంపెనీ చెందినవిగా ప్రమోట్ చేసుకోవచ్చన్న ఉద్దేశంతో పేర్లను మార్చుకుంటుంది. ప్రస్తుతానికి బీటా వెర్షన్‌లో ఈ పేరు కనిపిస్తుండగా, అన్ని వెర్షన్లకు త్వరలోనే కనిపించనుంది.

Advertisements
error: నమస్కారం!