Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

త్వరలో వైకాపాలో చేరనున్న డైరెక్టర్ వినాయక్ ?

 

గత కొంతకాలంగా వైసిపి ఫ్యానుకు బాగా రంగులలుముకుంటున్నాయి. ఎన్నికలకు ముందు నుండే సినిమా వాళ్లంతా ఒకరి తరువాత ఒకరు వైసిపి వైపు అడుగులేస్తున్నారు. కొంత మంది పాదయాత్రలో జగన్ తో అడుగులు కలిపి ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తే మరికొంత మంది వెనుక నుండే జగన్ కు మద్దతు తెలిపారు. ఎన్నికలు ముగిసినప్పటికీ రోజు రోజుకీ సినిమా రంగం నుండి వైసిపిలోకి చేరే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఒకరు వైసిపి జెండా కప్పుకోడానికి రెడీ అయ్యారనే వార్త హాట్ టాపిక్ గా మారింది.

 

మాస్ చిత్రాలతో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ వైసిపిలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాపు కార్పొరేషన్ చైర్మన్ గావైసీపీకి చెందిన యువ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాని నియమించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వినాయక్ రాజాకు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా వినాయక్ జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ ప్రసంగాలు, మాటలు తనలో స్ఫూర్తిని నింపాయని అన్నారు. ఒక రాజకీయ పార్టీ కార్యక్రమానికి హాజరై జగన్ ని పొగడ్తలతో ముంచేయడంతో వినాయక్ వైసిపిలో చేరబోతున్నట్లు మీడియాలో ప్రచారం జోరందుకుంది.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!