Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

ప్రకాశం జిల్లాలో మరో గ్రామ వాలంటీర్‌ ఆత్మహత్య

అప్పుల బాధతో గ్రామ వాలంటీర్‌ నూతలపాటి వెంకటకృష్ణ (21) ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లా, కొరిశపాడు మండలం, బొడ్డువాని పాలెంలో జరిగింది. గతంలో ఆయన తండ్రి అనారోగ్యం బారిన పడడంతో చికిత్స కోసం రూ. 10లక్షల వరకూ అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక కొద్ది రోజులుగా ఆయన తీవ్ర మనోవేదనతో ఉన్నాడు.

 

శనివారం ఉదయం వెంకటకృష్ణ తల్లి మార్టూరు వద్ద ఉన్న కంపెనీలో పనికివెళ్లారు. రాత్రికి తిరిగి వచ్చి చూసే సరికి వెంకటకృష్ణ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఉన్నాడు. అనంతరం వెంకటకృష్ణను మేదరమెట్లలోని ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!