Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

ప్రకాశం జిల్లాలో గ్రామ వాలంటీర్ ఆత్మ హత్య

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలో గ్రామ వాలంటీర్ షేక్ జుబేదా(20) ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం బాత్రూమ్ లో రాడ్ కు చున్నీతో ఉరేసుకుందని తల్లి తెలిపింది. తన కూతురి చావుకి తహసీల్దార్ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసే గుంటూరి శివప్రసాద్ కారణం అని తల్లి ఆరోపించింది.

 

శుక్రవారం రాత్రి శివప్రసాద్ చారి తమ ఇంటికి వచ్చాడని, రికార్డులన్నీ పూర్తి చేసి శనివారం ఉదయానికి కార్యాలయానికి తీసుకురావాలని తన కూతురిని హెచ్చరించాడని తల్లి చెప్పింది. సక్రమంగా పనిచేయడం లేదని, ఇలా అయితే ఉద్యోగం నుంచి తీసేస్తారని కటువుగా మాట్లాడారని తెలిపింది. శివప్రసాద్ మాటలతో మనస్తాపం చెందిన జుబేదా ఆత్మహత్య చేసుకుందని తల్లి కరీమున్‌ చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న శివప్రసాద్ కోసం గాలిస్తున్నారు.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!