Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

Chandrayaan 2 : విక్రమ్ ల్యాండర్ విరిగిపోలేదని ప్రకటించిన ఇస్రో

 

ఆదివారం విక్రమ్ ల్యాండర్ జాడను కనిపెట్టిన ఇస్రో ఇప్పుడు అది ఎలా ఉందో తెలుసుకోగలిగింది. చంద్రునిపైకి హార్డ్ ల్యాండింగ్ కావడంతో ల్యాండర్ విక్రమ్ ముక్కలైపోయి ఉంటుందని అందరూ భావించారు. అయితే విక్రమ్ పరిస్థితి యథాతథంగా ఉందని ఇస్రో అధికారులు అధికారికంగా ప్రకటించారు. నిజానికి అంత ఎత్తు నుంచీ అంత పెద్ద ల్యాండర్ (ల్యాండర్ బరువు ప్రజ్ఞాన్ రోవర్‌తో కలిపి 1,471 కేజీలు. అందులోని ప్రజ్ఞాన్ రోవర్ బరువు 27కేజీలు) పడితే పగిలిపోయే అవకాశాలు ఎక్కువ. కానీ చందమామపై ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి అది పగిలిపోకుండా ఉన్నది ఉన్నట్లుగా ఉందని తెలుస్తోంది.

 

విక్రమ్ ల్యాండర్ ఎక్కడైతే పడింతో అక్కడే అలాగే ఉందని వివరించారు ఇస్రోకి చెందిన ఓ అధికారి. పాటిజివ్ అంశాలు ఉండటం వల్ల ల్యాండర్‌ నుంచీ సిగ్నల్స్ రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇస్రో చెబుతున్నదాని ప్రకారం ల్యాండర్ క్షేమంగా ఉంది కాబ్టట్టి దాన్ని నుంచీ సిగ్నల్స్ అందుకునే అవకాశాలున్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

 

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!