Subhodayam

Latest Telugu News Updates | Latest News in Telugu | Andhra Pradesh | Telangana | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

సెకండ్ ఇన్నింగ్స్ లో రాములమ్మ రెమ్యునరేషన్

 

ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్ గా తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ విజయశాంతి. రాజకీయాల్లోకి ప్రవేశించాక దాదాపు 13 ఏళ్ళు గ్యాప్ తీసుకున్న విజయశాంతి తాజాగా మహేష్ బాబు హీరోగా వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు‘ సినిమాతో రీఎంట్రీ కి రెడీ అయింది.అప్పుడెప్పుడో 30 ఏళ్ళ క్రితం మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు కొడుకు దిద్దిన కాపురంలో కృష్ణకు భార్యగా ప్రిన్స్ కు అమ్మగా నటించిన విజయశాంతి ఇన్నేళ్ల తర్వాత అదే మహేష్ బాబు కోసం మేకప్ వేసుకోవడం విశేషం.

 

అయితే ఆ రోజుల్లోనే స్టార్ హీరోలతో పోటీ పడి రెమ్యునరేషన్ తీసుకున్న రాములమ్మ ఈ సినిమా కోసం ఎంత డిమాండ్ చేసిందనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే పిఆర్వొ గ్రూప్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం విజయశాంతి ఈ సినిమా కోసం సుమారుగా రెండు నుంచి నాలుగు కోట్ల రూపాయలు మధ్య తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మంచి డిమాండ్ ఉన్న గ్లామర్ హీరోయిన్లకు ఇచ్చినంత భారీ రెమ్యునరేషన్ ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు ఇస్తున్నారంటే రాములమ్మది ఎంతో కీలకమైన పాత్ర అయి ఉండాలి.అందులోనూ ప్రత్యేకత లేనిదే విజయశాంతి సైతం ఎస్ చెప్పరు. కాబట్టి సరిలేరు నీకెవ్వరులో రాములమ్మ పాత్ర చాలా స్పెషల్ అన్న విషయం మాత్రం క్లారిటీ వచ్చింది.

error: నమస్కారం!