Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం స్వాధీనం

Three held for smuggling gold bars worth Rs 2 crore

 

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో స్మగ్లింగ్ బంగారం పట్టుబడింది. శుక్రవారం రాత్రి ఇండిగో ఎయిర్ లైన్స్‌కు చెందిన కస్టమర్ సర్వీస్ అధికారి అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. రెవెన్యూ నిఘా అధికారులు అతణ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద టేప్‌తో చుట్టిన రెండు ప్యాకెట్లు దొరికాయి. వాటిలో 4.9 కేజీల బరువులు ఉన్న 42 బంగారు బిస్కెట్లు కనిపించాయి. వీటి విలువ దాదాపు రెండు కోట్ల వరకు ఉంటుంది. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారు సరైన వివరణ ఇవ్వకపోవడంతో పోలీసులకు అప్పగించారు.

 

 

error: నమస్కారం!