Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

గడ్డి ఉన్న చోటకు గొర్రె పరుగులు పెట్టినట్లు జూపూడి వైఖరి.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

జూపూడి ప్రభాకర్‌రావుపై కొండేపి ఎమ్మెల్యే బాలవీరాంజవేయస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జూపూడికి అధికారమే పరమావధిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న నేపద్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

 

అధికారంలో ఉన్న పార్టీలోనే జూపూడి ఉంటారని ఎద్దేవా చేశారు. గడ్డి ఉన్న చోటకు గొర్రె పరుగులు పెట్టినట్లు జూపూడి వైఖరి ఉందన్నారు. గతంలో దళిత పులిని అంటూ ప్రకటన చేసుకుని నేడు ఆ దళితులను వంచిస్తూ, వైసీపీలో చేరారన్నారు. ‘జగన్‌ కాలకేయుడు, ప్రమాదకరమైన విషం’ అంటూ చెప్పుకొచ్చిన జూపూడి ఇప్పుడు ఆ అవినీతి చెంతకే చేరారని జూపూడి పొగడ్తలు, ప్రశంసలు అన్నీ కూడా పదవుల కోసమేనని, ఊసరవెల్లిలా మారడం జూపూడికే సాధ్యమని అన్నారు.

Advertisements
error: నమస్కారం!