Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్ట్

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు . దళితులను కులంపేరుతో దూషించారనే కేసుతో సహా, తనపై ఉన్న వివిధ కేసులు కారణంగా గత 12 రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమెను చూసేందుకు దుగ్గిరాలలోని తన నివాసానికి చింతమనేని వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు చింతమనేనిని అదుపులోకి తీసుకున్నారు.

 

సెప్టెంబర్ 11, బుధవారం ఆయన బెయిల్ పిటీషన్ హై కోర్టులో విచారణకు రానుంది. తప్పు చేశారు కాబట్టే దాక్కున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో, పౌరుషం వచ్చి బెయిల్ పిటీషన్ రద్దు చేసుకుని బుధవారం జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు.

Advertisements
error: నమస్కారం!