Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం

 

కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారి దర్శనాన్ని సాధారణ భక్తులకు మరింత సులభతరం చేసే లక్ష్యంతో పలు నిర్ణయాలు తీసుకుంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం ప్రకటించింది. ఇకపై సాధారణ రోజుల్లో స్వామి దర్శనానికి వచ్చే వృద్ధులు, చిన్నారులతోపాటు వచ్చే తల్లిదండ్రులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఈ సదుపాయాన్ని ఈనెల 23వ తేదీ మంగళవారం నుంచి అమల్లోకి తేనున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ప్రతిరోజూ ఉదయం 10 గంటల స్లాట్‌లో వెయ్యి, మధ్యాహ్నం 2 గంటల స్లాట్‌లో 2 వేలు, మూడు గంటల స్లాట్‌లో మరో వెయ్యి టోకెన్లు వీరికోసం ప్రత్యేకంగా జారీ చేస్తారు.

 

65 ఏళ్లు పైబడిన వృద్ధులు, ఐదేళ్లలోపు చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులు, దివ్యాంగులు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన టోకెన్లు ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉన్న కౌంటర్లలో ఇస్తారు.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!