Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ.. శమీ వృక్ష ( జమ్మి చెట్టు ) విశిష్టత (విజయ దశమి స్పెషల్)

Sami Vruksham

 

శ్లో || శమీ శమయతే పాపం శమీ శత్రు నివారిణీ |
అర్జునస్య ధనుర్ధారీ శ్రీరామస్య ప్రియదర్శినీ ||

 

జమ్మిచెట్టు విజయానికి సంకేతం. శమీవృక్షంలో అగ్ని నిక్షిప్తమై ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. అగ్ని వీర్యమే సువర్ణం అంటారు. అందుకే జమ్మి బంగారం కురిపించే కల్పవృక్షంగా పూజలందుకుంటోంది. అందుకే యజ్ఞ యాగాదుల వేళ జమ్మి కొమ్మల రాపిడి ద్వారా మాత్రమే అగ్నిని సృష్టిస్తారు. అలాంటి శమీ వృక్షం దేవీ రూపమని, విజయదశమి రోజు శమీపూజ చేసేవారికి అమ్మలగన్న అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని దేవీ భాగవతం చెప్తోంది.

 

విజయదశమి రోజున జమ్మిచెట్టుకు పూజ చేయడం మన సంప్రదాయం. జమ్మిచెట్టు పాపాలను పోగొడుతుంది. శత్రువులను నిర్మూలిస్తుంది. పుణ్యం ప్రసాదిస్తుంది. విజయసిద్థికి యాత్ర చేసే మానవాళికి ఆటంకాలను తొలగించి విజయాలను సాధించి పెడుతుంది. ఇంతటి మహిమగల శమీ పూజతో కూడిన పుణ్యదినం కాబట్టే ఈ పవిత్ర రోజుకు విజయదశమి అని పేరొచ్చింది అంటారు. దసరానాడు జమ్మిచెట్టును పూజించడాన్నే శమీపూజ అంటారు. జమ్మిచెట్టు విజయానికి సంకేతం. పూర్వం ద్వాపరయుగంలో పాండవులు తమ ఆయుధాలను అన్నింటినీ ఈ జమ్మిచెట్టుపైనే సంరక్షించి, తర్వాత వాడుకొన్నారు. వారికి యుద్ధంలో విజయం లభించింది. జమ్మిచెట్టు పాపాలను హరిస్తుందనీ, శత్రువులను తుదముట్టిస్తుందనీ, అర్జునునివంటి మహావీరునికి ధనుర్బాణాలను ప్రసాదించిందనీ, రామునికి ప్రియాన్ని చేకూర్చిందనీ, విజయయాత్రలలో సత్ఫలితాలను ప్రసాదించిందనీ, ఎలాంటి ఆటంకాలు లేని జీవితాన్ని ప్రసాదించిందన్నది పూజలోని పరిమార్థం.

 

‘‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ,
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ.
శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా,
ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ.
కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా,
తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.”

 

శమీ వృక్షము అనేది పాపాన్ని శమింపచేసేది. శత్రువులను నాశనం చేస్తుందిది. ఇది నాడు అర్జునుని ధనువును కల్గి ఉండింది. శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది. యాత్రార్థులకు సౌఖ్యాన్నిస్తుంది. పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!