Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

సుప్రీంకోర్టులో చిదంబ‌రానికి చుక్కెదురు.. ముందస్తు బెయిల్ నిరాకరణ

Lookout notice issued against Chidambaram

ఐఎన్ఎక్స్ మీడియా కుంభ‌కోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబ‌రానికి ముంద‌స్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ త‌న‌ను అరెస్టు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున‌ద‌ని, త‌న‌కు బెయిల్ ఇవ్వాలంటూ చిదంబ‌రం పిటిష‌న్ పెట్టుకున్నారు. కేసు ద‌ర్యాప్తు ఆరంభ‌ద‌శ‌లో ఉన్న‌ప్పుడు బెయిల్ ఇవ్వ‌డం వ‌ల్ల ఆ కేసు విచార‌ణ మంద‌గిస్తుంద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. సాధారణ బెయిల్ కోసం కింది కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది సుప్రీంకోర్టు.

 

ఈ కేసులో 2017లో ఈడీ అక్రమ డబ్బు తరలింపు కేసు నమోదు చేసింది. ఈ ఏడాది ఆగస్ట్ 20న చిదంబరం పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హోకోర్టు తిరస్కరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో ఇప్ప‌టికే చిదంబ‌రం సీబీఐ క‌స్ట‌డీలో ఉన్నారు.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!