Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

SBI Debit Cards : ఇక నుంచి SBI డెబిట్ కార్డ్స్ ఉండవు

SBI wanto eliminate debit cards

డిజిట‌ల్ పేమెంట్స్‌ను ప్రోత్స‌హించే నేప‌థ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్(ఎస్‌బీఐ) కార్డుల‌ను పూర్తిగా ర‌ద్దు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే యోనో క్యాష్ పేరుతో సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా . అయితే యోనో క్యాష్ గురించి అవగాహన ఉన్నవారు తక్కువే. యోనో క్యాష్ గురించి తెలిసినవారు కార్డు లేకుండానే డబ్బులు డ్రా చేసుకుంటున్నారు.

 

యోనో క్యాష్‌పై అందరికీ అవగాహన పెరిగితే ఇక ఏటీఎం కార్డుల అవసరమే ఉండదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇదే కోరుకుంటోంది. డిజిటల్ పేమెంట్స్‌ని ప్రోత్సహించి ఏటీఎం కార్డుల్ని పూర్తిగా తొలగించాలని ఎస్‌బీఐ భావిస్తున్నట్లు చైర్మ‌న్ ర‌జ‌నీశ్ కుమార్ తెలిపారు. దేశంలో 90 కోట్ల డెబిట్ కార్డులున్నాయి. మ‌రో 3 కోట్ల క్రెడిట్ కార్డుల‌న్నాయ‌న్నారు.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!