Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

అప్పు ఇస్తాం, తీర్చే శక్తి ఉందా ? ఏపీ ఆర్థిక స్థితిపై ఎస్‌బీఐ అనుమానాలు

ప్రస్తుతం లోటు బడ్జెట్ తో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రం ప్రభుత్వ కార్పొరేషన్స్ నిధులను రాష్ట్ర అవసరాలకు ఉపయోగిస్తుంది. అయితే ఇప్పుడు కార్పొరేషన్స్ కి కూడా నిధులు కొరత వచ్చింది. రూ.3 వేల కోట్ల రుణం మంజూరు విషయంలో జగన్ సర్కారుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ రకంగా షాకిచ్చింది. అప్పు ఇస్తాం సరే, తీర్చే శక్తి ఉందా ? ఇప్పటికే తీసుకున్న రుణాలపై వస్తున్న ఆదాయమెంత? మళ్లీ అప్పు తీసుకుంటే ఎలా కడతారంటూ ప్రశ్నించింది.

 

విద్యుత్ సంస్థ యొక్క లాభనష్టాలు బేరీజు వేసుకుంటే ఒక్క పదిరూపాయలు కూడా లోన్ వచ్చే అవకాశం లేదు. దీనితో ప్రభుత్వం హామీ ఇస్తానని చెప్పింది, నిజానికి ప్రభుత్వం హామీ ఇస్తుంటే కళ్ళు మూసుకొని లోన్స్ ఇస్తారు బ్యాంకర్లు, అయితే ఎస్​బీఐ బ్యాంకు మాత్రం లోన్ ఇవ్వటానికి ముందుకి రాలేదు.

 

తమ సందేహాలు, అభ్యంతరాలకు సమాధానం ఇవ్వాలంటూ ఏపీపీఎఫ్​సీఎల్ ఎండీకి ఎస్​బీఐ లేఖ రాసింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2.52 లక్షల కోట్లు ఉన్నాయి. 2020 నాటికి అప్పుల భారం రూ.3 లక్షల కోట్లకు చేరుతుందన్న బ్రిక్‌వర్క్‌ నివేదికను ఈ లేఖలో స్టేట్ బ్యాంక్ ప్రస్తావించింది. ‘2016-17లో ఏపీపీఎఫ్‌సీఎల్‌ రుణాలు రూ.9665 కోట్లుంటే.. 2018 నాటికి అవి రూ.35,964 కోట్లకు పెరిగాయని ఎస్‌బీఐ తెలిపింది.

 

దీన్ని దృష్టిలోఉంచుకుని రుణం తిరిగి చెల్లింపు..అందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని బ్యాంకు సూచించింది. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు, వివరణలు పంపితే వాటిని తమ కార్పొరేట్‌ కార్యాలయానికి పంపుతామని తెలిపింది.

Read More
error: నమస్కారం!