Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

Galaxy A90 5G : 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన శామ్సంగ్

శామ్సంగ్ మంగళవారం దక్షిణ కొరియాలో కొత్త 5 జి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో 5 జి సపోర్ట్‌తో వచ్చిన మొదటిది శామ్సంగ్ గెలాక్సీ ఎ 90. బడ్జెట్ ఫ్రెండ్లీ ఏ-సిరీస్‌లో తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ ఇది. సెప్టెంబర్ 4న సౌత్ కొరియాలో శామ్సంగ్ గెలాక్సీ ఏ90 సేల్ మొదలవనుంది. స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ట్రిపుల్ కెమెరాలో సూపర్ స్టెడీ, సీన్ ఆప్టిమైజర్, ఫ్లా డిటెక్టర్, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

 

శామ్సంగ్ గెలాక్సీ ఎ 90 ఫీచర్స్

డిస్‌ప్లే: 6.7 అంగుళాల సూపర్ అమొలెడ్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
ర్యామ్: 6 జీబీ, 8 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 855
రియర్ కెమెరా: 48+5+8 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,500 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై + సాంసంగ్ వన్ యూఐ
కలర్స్: బ్లాక్, వైట్
ధర: సుమారు రూ.53,000

Read more
error: నమస్కారం!