Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

ప్రజల ఆరోగ్యమే ముఖ్యం..సురక్షిత తాగునీటి సరఫరాపై సీఎం జగన్ సమీక్ష

ఈ రోజు తాగు నీటి సరఫరాపై ఉన్నతాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు సురక్షిత తాగు నీటి సరఫరా తమ ప్రధాన లక్ష్యం అని తెలిపారు. వాటర్‌ గ్రిట్‌ పథకం కింద మూడు దశల్లో పనులు చేపట్టాలని ఆదేశించారు. మొదటి దశలో శ్రీకాకుళం, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో, రెండో దశలో విజయనగరం, విశాఖ, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో, మూడో విడతలో కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో చేపట్టాలని చెప్పారు.

 

ఉద్దానం తాగు నీటి ప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లా అంతటికి వర్తింపజేయాలని తెలిపారు. నీటిని తీసుకున్న చోటే శుద్ధి చేసి అక్కడి నుంచి పంపిణీ చేయాలని ప్రాథమికంగా సీఎం జగన్ నిర్ణయించారు. దీనిపై నిశిత అధ్యయనం చేసి, ప్రణాళిక ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.సమ్మర్ స్టోరేజి ట్యాంకులు, మంచినీటి చెరువుల్లో తాగునీటిని నింపిన తర్వాత కలుషితం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Advertisements
error: నమస్కారం!