Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

Saaho Vs SyeRaa : సాహో vs సైరా

ప్రస్తుతం టాలీవుడ్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విజువల్స్ తో రెండు భారీ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఒకటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న `సాహో`’ కాగా మరొకటి మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘సైరా’. రెండు డిఫరెంట్ జోనర్ సినిమాలే అయినప్పటికీ రెండింటిలో భారీ యాక్షన్స్ ఉండబోతున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడి కథతో తెరకెక్కుతున్న సైరా చిత్రంలో వార్ ఎపిసోడ్స్ `బాహుబలి` తరహాలో మైమరిపించనున్నాయన్న టాక్ ఉంది. ఇక సాహో యాక్షన్ దృశ్యాలు భారీ హాలీవుడ్ చిత్రాల తరహాలో అబ్బురపరచనున్నాయట.

 

రెండు సినిమాల్లోనూ బాలీవుడ్- కోలీవుడ్ స్టార్లు నటిస్తున్నారు. ఇలా అన్ని కోణాల్లోనూ రెండు సినిమాలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. ఇక ప్రమోషన్ విషయానికొస్తే `సాహో` ప్రీరిలీజ్ ఈవెంట్ ని దాదాపు 2కోట్లు వెచ్చించి రామోజీ ఫిలింసిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు సినీ దిగ్గజాలతో పాటు లక్ష మంది డార్లింగ్ ఫ్యాన్స్ పోటెత్తారు. దాంతో సాహోకి ఏ మాత్రం తగ్గకుండా `సైరా` ప్రీరిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నాడట నిర్మాత రామ్ చరణ్. మొత్తానికి నెలరోజుల గ్యాప్ తో విడుదలవుతున్న ఈ రెండు సినిమాల మధ్య అంతకంతకు వార్ పెరుగుతోందనే సంకేతాలు అందుతున్నాయి.

Advertisements
error: నమస్కారం!