Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

ఆగష్టు12 నుంచి రిలయన్స్ జియో గిగా ఫైబర్ సేవలు

 

 

 

అంతర్జాతీయ మార్కెట్‌లో రిలయన్స్‌ మరో సంచలనానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టెలికాం చరిత్రలో జియో ఇప్పటికే తన కంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపింది. ఎప్పటి నుంచో ఊరి స్తున్న ‘జియో గిగా’ ఫైబర్‌ పేరుతో సూపర్‌ ఫాస్ట్‌ ఇంటర్నెట్‌ సేవలతో ఈ రంగం రూపు రేఖలను మార్చి వేసేందుకు రంగం సిద్ధం చేసింది.

 

ఆగస్టు 12 నుంచి ఈ మేరకు పూర్తి అధికారికంగా జియో గిగా ఫైబర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జియో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌తో పాటు ఉచిత ల్యాండ్‌లైన్‌ అందించడం విశేషం. అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌ను దేశమంతా అందించే ఈ ల్యాండ్‌లైన్‌ కనెక్షన్‌ ద్వారా ప్రస్తుతం సిగ్నల్‌ లేమి సమస్యకు చెక్‌ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రముఖ నగరాల్లో ప్రయోగాత్మకంగా కనెక్షన్‌లు ఇచ్చిన జియో గిగా ఫైబర్‌ సేవలు ఇక మధ్యతరహా పట్టణాలకూ అందనుంది.

 

ఇక జియో గిగాఫైబ‌ర్ పేరిట ఒకేసారి మూడు సేవ‌ల‌ను క‌స్ట‌మ‌ర్లకు అందివ్వ‌నున్నార‌ని స‌మాచారం. నెల‌కు రూ.600 క‌నీస చార్జితో ఒకేసారి బ్రాడ్‌బ్యాండ్ ఇంట‌ర్నెట్‌, ల్యాండ్‌లైన్‌, డిష్ టీవీ సేవ‌ల‌ను అందిస్తార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఈ ప్లాన్‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు ఇంట‌ర్నెట్ స్పీడ్ గ‌రిష్టంగా 50 ఎంబీపీఎస్ ల‌భిస్తుంది. నెల‌కు 100 జీబీ డేటాను ఉచితంగా ఇస్తారు. అలాగే 100 ఎంబీపీఎస్‌తో మ‌రొక ప్లాన్‌ను కూడా ప్ర‌వేశ‌పెట్ట‌నున్నార‌ని తెలిసింది. ఇక ఇప్ప‌టికే చాలా మంది వినియోగ‌దారులు జియో గిగాఫైబ‌ర్ సేవ‌ల‌ను ఉప‌యోగిస్తున్నారు.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!