Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

Jio Fiber : మొదటి రోజు, మొదటి షో మీ ఇంట్లోనే చూడొచ్చు : ముకేష్అంబానీ

 

రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ఫైబర్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.రిలయెన్స్ జియో గిగాఫైబర్ కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. గిగాఫైబర్‌ సేవల్ని పొందే కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది రిలయెన్స్ జియో.

 

గిగాఫైబర్ సంవత్సరం ప్లాన్ తీసుకున్నవారికి హెచ్‌డీ 4K ఎల్ఈడీ టీవీతో పాటు సెట్ టాప్ బాక్స్ ఉచితంగా ఇవ్వనున్నట్టు రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ ఎండీ ముకేష్ అంబానీ ప్రకటించారు. ‘జియో ఫరెవర్ యాన్యువల్ ప్లాన్స్’ పేరుతో ఈ ఆఫర్ ప్రకటించారు. ఈ యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే కేవలం ప్లాన్ ఛార్జీలు చెల్లిస్తే చాలు. హెచ్‌డీ 4K ఎల్ఈడీ టీవీ, సెట్ టాప్ బాక్స్ ఉచితంగా పొందొచ్చు. గిగాఫైబర్ ప్లాన్స్ 100 ఎంబీపీఎస్ స్పీడ్ నుంచి 1 జీబీపీఎస్ వరకు ఉంటాయి. రూ.700 నుంచి రూ.10,000 వరకు ప్లాన్స్ ధరలు ఉంటాయి. జియో ఫైబర్ ప్రీమియం కస్టమర్లు సినిమా రిలీజైన రోజే ఇంట్లో టీవీలో చూడొచ్చని ముకేష్ అంబానీ తెలిపారు.

Advertisements
error: నమస్కారం!