Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

‘ఆవిరి’ తో సెగ పుట్టిస్తున్న రవిబాబు

 

విభిన్న క‌థా చిత్రాల‌ని తెర‌కెక్కిస్తూ త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు ర‌విబాబు. ఆయ‌న పందిపిల్ల ప్ర‌ధాన పాత్ర‌లో అదుగో అనే సినిమాని రూపొందించాడు. ఈ సినిమా అనుకున్నంత ఆద‌ర‌ణ పొంద‌లేదు. తాజాగా ఆవిరి అనే సినిమా తెర‌కెక్కిస్తున్నాడు ర‌విబాబు. ఇందులో ర‌విబాబు, నేహా చౌహ‌న్, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్, ముక్త‌ర్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఫ్లైయింగ్ ప్రాగ్స్ చిత్రాన్ని నిర్మిస్తుంది. స‌క్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు త‌న సొంత బేన‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బేన‌ర్ మీదుగా చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఈ లుక్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. స్ట‌వ్‌పై ఉన్న కుక్క‌ర్ మ‌ధ్య‌లో నుండి నేహా చూస్తున్న‌ట్టుగా ఫ‌స్ట్ లుక్ డిజైన్ చేశారు. ఈ చిత్రంతోనైన ర‌విబాబు మంచి విజ‌యం సాధిస్తాడా అనేది చూడాలి.

 

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!