Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

మోడీ జీ.. మాపై చిన్న చూపు ఎందుకు? : ఉపాసన

Upasana question to PM Modi

మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ బాలీవుడ్ సెలెబ్రిటీలతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. గాంధీ ఆశయాలను సినిమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉందని ఆయన అన్నారు. దీనిపై చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య, ఉపాసన స్పందించారు. సౌత ఇండస్ట్రీపై చిన్న చూపు ఎందుకని నేరుగా మోడీని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

 

‘డియరెస్ట్ నరేంద్ర మోడీ జీ. దక్షిణ భారతదేశంలో ఉన్న మేము మిమ్మల్ని ప్రధానిగా ఉన్నందుకు గర్వంగా భావిస్తున్నాం. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకు కేవలం హిందీ ఆర్టిస్టులను మాత్రమే పిలిచి దక్షిణాది సినిమా ఇండస్ట్రీపై నిర్లక్ష్యం చూపించారు. నాకు బాధగా అనిపించి భావాలను మీతో పంచుకుంటున్నాను. దీన్ని సరైన విధంగా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను’ అని ఉపాసన ట్వీట్ చేశారు.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!