Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

రాజ్ తరుణ్ కారుకి యాక్సిడెంట్.. త్రుటిలో తప్పిన ప్రమాదం

 

టాలీవుడ్ హీరో తరుణ్ కారుకి యాక్సిడెంట్ జరిగిందని, తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారని సోషల్ మీడియా, టీవీలలో వార్తలు రావడంతో వెంటనే స్పందించిన తరుణ్ తనకు ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదని, తానూ, తన కారూ క్షేమంగానే ఉన్నామని స్పష్టం చేశారు.

 

 

అయితే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది యంగ్ హీరో రాజ్ తరుణ్ కారుకు అంటున్నారు. నిన్న రాత్రి నార్సింగ్ సమీపంలో అల్కాపూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై రాజ్ తరుణ్ కారు (TS 09 EX 1100) ప్రమాదానికి గురైంది. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. కారు డివైడర్‌ను డీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

Advertisements

 

 

కారు యాక్సిడెంట్‌కు సంబంధించి సీసీ ఫుటేజ్‌ను పరిశలించిన పోలీసులు కారులో ఉన్నది రాజ్ తరుణ్ అని తేల్చారు. ప్రమాదం తరువాత స్వల్ప గాయాలతో బయటపడిన రాజ్ తరుణ్, పరుగులు తీస్తూ మరో కారులో వెళ్లిపోయినట్లు గుర్తించారు. అయితే రాజ్ తరుణ్‌ను చూసిన కొందరు, అతని పేరు తరుణ్ అని పేర్కొనడంతో, మీడియా పొరపాటుతో హీరో తరుణ్ ఫోటోల్ని ప్రసారం చేసింది. దీనిపై తరుణ్ కాసేపటి క్రితం వివరణ ఇచ్చాడు కూడా. యాక్సిడెంట్ తరువాత రాజ్ తరుణ్ ఎక్కడికి వెళ్లాడన్న విషయం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం రాజ్ తరుణ్ ఎక్కడ ఉన్నాడన్న విషయమై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

error: నమస్కారం!