Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

విజయ్ తో పూరీ ఏం మ్యాజిక్ చేయబోతున్నాడు?

ఈ మధ్య టాలీవుడ్ లో రెగ్యులర్ కి కాస్త భిన్నంగా సినిమాలు విడుదలవుతున్నాయి. హీరోలు సైతం కమర్షియల్, లవ్ స్టోరీస్ అంటూ రెగ్యులర్ స్టైల్ లో వెళ్లకుండా వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆ మధ్య ‘రంగస్థలం’ సినిమాలో రామ్‌చరణ్ చెవిటి పాత్రలో నటించి మెప్పించాడు. మాస్ రాజా రవితేజ కూడా ‘రాజాదిగ్రేట్’ సినిమాలో కళ్లు కనపడని వ్యక్తిగా నటించాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ‘జైలవకుశ’ చిత్రంలో మాటలు సరిగా పలకలేని వ్యక్తిగా నటించి అదరగొట్టిన సంగతి తెలిసిందే.

 

ఇప్పుడు ఇదే దారిలో నడవబోతున్నాడట టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయదేవరకొండ. ఇటీవల ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో డీలా పడిపోయిన విజయ్, డాషింగ్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు . ఈ సినిమాలో విజయ్ ఓ డిఫరెంట్ పాత్రలో అలరించనున్నాడని టాక్. ‘ఇస్మార్ట్ శంకర్‌’తో సూపర్ హిట్ అందుకున్న పూరీ ఓ సూపర్ క్రేజీ పాత్రను విజయ్ కోసం డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. పూరీ సొంత నిర్మాణంలో వచ్చే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మాటలు సరిగా పలకలేని వ్యక్తిగా నటించనున్నాడట. మరి పూరి మ్యాజిక్ తో విజయ్ బ్యాక్ తో బ్లాక్ బాస్టర్ అవుతాడో లేదో చూడాలి.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!