Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

మోదీ చాలా తెలివైన వ్య‌క్తి .. ఏ బటన్ నొక్కినా ఓటు కమలానికే : బీజేపీ ఎమ్మెల్యే

bakshish singh

హరియాణా బీజేపీ ఎమ్మెల్యే ఈవీఎం మెషిన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసంద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే భ‌క్షిష్ సింగ్ విర్క్ ఓ ఎన్నికల మీటింగ్‌లో ప్రసంగిస్తూ ఓటర్లకు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఈవీఎంలో ఎవ‌రెవ‌రు ఏ బ‌ట‌న్ నొక్కుతున్నారో త‌మ‌కు తెలుస్తుందన్నారు.

 

ప్ర‌ధాని నరేంద్ర మోదీ చాలా తెలివైన వ్య‌క్తి అని, మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ కూడా తెలివైన వ్య‌క్తే అని, మీరు ఏ బ‌ట‌న్ నొక్కినా, అది బీజేపి ఖాతాలోకి వెళ్తుంద‌న్నారు. ఈవీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే భ‌క్షిష్ సింగ్ విర్క్‌కు ఎన్నికల సంఘం నోటిసులు జారీ చేసింది.

 

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!