Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

Magic Rice : ఈ బియ్యం వండక్కర్లేదు.. నానబెట్టి అన్నం తినొచ్చు

 

కేవలం ‘‘బియ్యాన్ని నానబెడితే’’ చాలు అన్నం రెడీ అయిపోతుంది!. ఎక్కడో కాదు మన భారత దేశంలోనే అస్సోంలో ఈ కొత్తరకం బియ్యాన్ని కొన్ని సంవత్సరాలుగా పండిస్తున్నారు. కానీ వీటి గురించి అందరికీ తెలియని ఈ వండనక్కరలేని బియ్యం గురించి తెలుసుకుందాం.

 

కొత్తరకం బియ్యం వండకుండానే అన్నం తయారైపోతుంది. మనదేశంలోనే ఉత్పత్తి అవుతున్న ఈ రకం బియ్యం..మరికొన్ని రోజుల్లోనే దేశంలోని అందరికీ అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ ఉడకని.. నానబెడితే అన్నం తయారయ్యే ఈ రకం బియ్యం విశేషాలు ఏంటో చూద్దాం.

Advertisements

 

ఈ బియ్యం పేరు ‘బోకా సౌల్’ లేదా ‘మట్టి బియ్యం’ అని అంటారు. ముద్దుగా మ్యాజిక్ రైస్ అని కూడా అంటారు. అసోంలోని కొండ ప్రాంతాల్లో పండించే వరి రకం – నల్బరి, బార్పేట , గోల్పారా , కమ్రప్, దరాంగ్, ధుబ్రీ, చిరాంగ్, బొంగాయాగోవాన్, కొక్రాజార్, బక్సా మొదలైనవి. ఈ పంట సీజన్ జూన్ నెల నుంచి డిసెంబర్ వరకూ ఈ ఆరు నెలలు పంటకు అనుకూలమంటున్నారు రైతన్నలు. దొడ్డుబియ్యంలా లావుగా ఉంటాయివి.ఈ బియ్యాన్ని పొయ్యిమీద పెట్టిన ఉడికించాల్సిన అవసరం లేదు. చన్నీళ్లలో ఓ గంట నానబెడితే చాలు అన్నం తయారైపోతుంది. మనం రోజు వండుకునే అన్నంలాగే ఈ అన్నాన్ని చక్కగా తినొచ్చు.

 

ఓ కేజీ మామూలు రైస్ వండితే ఎంత ఎక్కువ అన్నం తయారవుతుందో, ఈ రైస్ ను నానబెట్టినా అంతే ఎక్కువ తయారవుతుంది. ఈ పంట పండించటానికి పురుగు మందులు, రసాయనక ఎరువులు అవసరం లేదు. వీటిని వినియోగిస్తే పంట నాశనం అయ్యే ప్రమాదముందంటున్నారు అగ్రికల్చర్ సైంటిస్టులు. సో.. గ్యాస్ తో పనిలేదు, కరెంట్ అవసరం లేదు, కుక్కర్లు కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓ గంట నానబెడితే చాలు అన్నం తయారైపోతుంది.

 

ఈ బియ్యాన్ని అసోం రైతులు కొన్ని సంవత్సరాలుగా పండిస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం దీనికి పేటెంట్ కూడా ఇచ్చింది. దీంతో మరోసారి మ్‌డ రైస్ అంశం చర్చనీయాంశం అయ్యింది. పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో ఈ రకం వంగడాన్ని సృష్టించారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. అసోం రాష్ట్ర ప్రజలు పండుగలు, ఫంక్షన్లలో ఈ బియ్యంతోనే అన్నాన్నే వినియోగిస్తున్నారు. మొఘల్ రాజుల కాలంలో ఇలాంటి బియ్యం ఉత్పత్తి జరిగేదని పరిశోధకులు తెలిపారు. 17వ శతాబ్దంలో సైనికులు ఈ బియ్యంతో తయారైన అన్నాన్నే తినేవారట.

 

ఈ బియ్యంపై ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిగాయి. ముఖ్యంగా గువాహటి యూనివర్సిటీ పరిశోధనల్లో బోకా సౌల్ బియ్యం విశిష్టతను వివరించారు. ఈ బియ్యంలో పీచుపదార్ధం 11శాతం, మాంసకృత్తులు 7శాతం ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ఈ అన్నం తినటం వల్ల శరీరంలో వేడి కూడా తగ్గుతుందంటున్నారు నిపుణులు.

error: నమస్కారం!