Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

పది వేలు తీసుకుంటే బొమ్మ వేయించుకోవాల్సిందే.. రంగంలోకి దిగిన పోలీసులు

 

ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థికంగా చేయూత అందించేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వాహనమిత్ర పథకాన్ని ఇటీవల ప్రారంభించింది. ఆ వాహనాలు ఉన్నవారికి ఈ పథకం కింద ఏడాదికి రూ. 10 వేలు ఇస్తారు. ఈ పథకం ప్రారంభం సందర్భంగా డ్రైవర్లు తమ ఆటోలు, ట్యాక్సీలపై జగన్ బొమ్మ పెట్టుకోవాలని, దాన్ని చూస్తే పోలీసులు తనిఖీ చేయరని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు.

 

విజయవాడలో పోలీసులు, ఆర్టీఏ అధికారులు రోడ్డుపై కాపుగాచి అటు వెళ్తున్న ఆటోలపై బలవంతంగా జగన్ స్టిక్కర్లను అతికిస్తున్నారు. ‘బొమ్మ తప్పనిసరి’ అని దబాయిస్తున్నారు. స్టిక్కర్లపై జగన్ బొమ్మ కింద థ్యాంకూ అని ఉంది. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకోడానికి పేపర్లు, టీవీలు ఉంటాయని, కానీ అందరూ ఎక్కే ఆటోలపై ఇలా చేయడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. లబ్ధిదారుల్లో కూడా రకరకాల పార్టీల వారు ఉంటారని, ఇలా అంటించడం వారి మనోభావాలను దెబ్బతీసినట్లేనని విమర్శిస్తున్నాయి.

Advertisements

 

error: నమస్కారం!