Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించిన జియో .. అల్ ఇన్ వన్ ప్యాక్స్

jio new plans

జియో తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది. జియో ‘ఆల్ ఇన్ వన్ ప్లాన్‌’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో ఇటీవల ఇతర నెట్‌వర్కులకు నిమిషానికి 6 పైసలు అంటూ అవుట్ గోయింగ్ కాల్ చార్జి ప్రకటించిన నేపథ్యంలో వినియోగదారులు నిరాశకు గురయ్యారు. ఇప్పుడు తమ వినియోగదారులను సంతృప్తి పరిచేందుకు కొత్త రీచార్జి ప్లాన్లను ప్రవేశపెట్టింది.

 

జియో ఆల్ ఇన్ వన్’ పేరుతో మొత్తం 3 ప్లాన్లను ప్రకటించింది. నెలకు రూ.222, రెండు నెలలకు రూ.333, మూడు నెలలకు రూ.444 చొప్పున ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ మూడు ప్లాన్లలో రోజుకు 2 జీబీ డేటా లభిస్తోంది. జియో నుంచి జియో నంబర్లకు కాల్స్ ఉచితం. ఇతర నెట్ వర్కులకు చేసే కాల్స్‌పై 1000 నిమిషాల ఉచిత టాక్ టైమ్ లభిస్తోంది.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!