Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

‘సాహో’ సినిమా విష ప్రచారంపై ‘గ్రేట్ ఆంధ్ర’ వెబ్ సైట్ కి గూబ గుయ్యిమనిపించిన లోకేష్

ఈ అబద్ధాలు రాసిన నకిలీ జర్నలిస్టు సిగ్గుపడాలి. కుల విభజన, విద్వేషం నింపి సంపాదించిన సొమ్ముతో తిండి ఎలా తింటున్నారు? మీకు మనస్సాక్షి అనేదే లేదా? అని తప్పుడు కథనాలతో వార్తలు రాస్తున్న ఒక వెబ్ సైట్ గురించి తెలుగుదేశం నేత నారా లోకేష్ తనదైన శైలిలో గూబ గుయ్యమనిపించారు.

 

అసలు విషయానికొస్తే తాజగా, ప్రభాస్ సాహో సినిమా ప్రమోషన్లో భాగంగా, ప్రభాస్ ఒక తమిళ వెబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంలో అక్కడ యాంకర్ పాలిటిక్స్ గురించి అడగగా, నాకు రాజకీయాల గురించి తెలియదు అని, జగన్ యువ ముఖ్య మంత్రి అని, పరిపాలన బాగా చేస్తాడని, అని అన్నారు. ఇలా చెప్పటం వల్లనే తెలుగుదేశం వాళ్ళు సాహో నెగటివ్ ప్రచారం చేస్తున్నారని ఆ వెబ్ సైట్ వాళ్ళు ఒక కధనం రాశారు. దీని ఎవరూ స్పందించకుంటే ఆ వార్త నిజమవుతుందేమోనని నా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఆ వెబ్ సైట్ వాళ్ళని టాగ్ చేసి మరీ ఝలక్ ఇచ్చారు.

Advertisements

 

సాహో ఓ భారీ బడ్జెట్ చిత్రం. ఈ అద్భుతమైన సినిమాను చూడ్డానికి ప్రభాస్ ఫ్యాన్స్ లాగా నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. సాహో చిత్రాన్ని ప్రభాస్ ఫ్యాన్సే కాదు, టీడీపీ కార్యకర్తలు కూడా చూసి, ఆ పనికిమాలిన కథనాన్ని తిప్పి కొట్టండి” అంటూ ట్వీట్ చేశారు.

 

error: నమస్కారం!