Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

కర్ణాటకలో 300 మంది ఫోన్ల ట్యాప్‌ చేశారు : ఎంపీ సుమలత

Sumalatha on Phone Tapping

 

తన ఫోన్ ని ట్యాప్ చేశారని తనకు అనుమానంగా ఉందని మాండ్య ఎంపీ సుమలత ఆరోపించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగిస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా కర్ణాటకలో సుమారు 300 మంది ఫోన్లను ట్యాప్‌ చేశారని మండ్య ఎంపీ సుమలత అంబరీష్‌ ఆరోపించారు.

 

 

మండ్య తాలుకాలోని పణకనహళ్ళి గ్రామంలో సుమలత మీడియాతో మాట్లాడుతూ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించడం మంచిదేనని అన్నారు.త్వరలోనే ఎవరు ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారో బయటకు వస్తుందని ఆమె అన్నారు. నిజాలు బటయకు వస్తాయని తనకు నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆమె పేర్కొన్నారు.

Advertisements

 

 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మాండ్య ఎంపీ గా గెలుపొందారు. ఇదే స్థానం నుంచి పోటీ చేసిన మాసీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ పరాజయం పాలయ్యారు.

error: నమస్కారం!