Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

ఈ ఆహారం తీసుకోవటం వల్ల సులభంగా బరువు తగ్గించుకోవచ్చు

చాలా మంది బరువు తగ్గాలి అనుకుంటూ ఉంటారు, కానీ బరువు తగ్గటానికి పాటించాల్సిన సరైన పద్దతులు తెలియక సతమతమవుతుంటారు. సరైన ఆహరం మరియు ఆహార ప్రణాళికను రుపొందించుకోండి. అనారోగ్యకరమైన ఆహారం తీసుకొంటూ బరువు తగ్గటం అనేది చాలా కష్టం. కొవ్వు, నూనెలు మరియు అనారోగ్యాన్ని కలుగచేసె ఆహర పదార్థాలు కాకుండా స్వతహాగా మీకు మీరుగా రుచికరమైన ఆహారాన్ని మరియు తక్కువ కొవ్వు కలిగిన ఆహారాన్ని ఎంచుకోండి.

 

మీరు ఎంచుకోనే ఆహరంలో తప్పకుండా పోషకాలు ఉండేలా చుసుకోవాలి. పోషకాలు ఎక్కువగా తీసుకోవటం వలన ఆరోగ్యంగా పెంపొందించబడుతుంది. సరైన ఆహారాన్ని తీసుకోని సులువుగా బరువు తగ్గించుకోవచ్చు, అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, వ్యాయమాలు చేయటం వలన బరువు తగ్గటం చాలా కష్టం మరియు ఇతరేతర వ్యాధుల భారిన పడే అవకాశం ఉంది.

Advertisements

 

ఓట్స్

తిన్న తరువాత ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉండాలంటే, ఓట్స్’ని ఎంచుకోండి. ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి మరియు ఇవి రోజులో 5 గ్రాముల ఫైబర్’ని అందించి, ఎక్కువ సమయం ఆకలి అవకుండా చేస్తాయి. ఉదయన అల్పాహరంగా ఓట్స్’ని తీసుకోవటం వలన ఏలాంటి జంక్ ఫూడ్ తీసుకోవలసిన అవసరం ఉండదు. వీటిలో అధికంగా ఫైబర్’లు ఉండటం వలన ఆకలిగా అనిపించదు.

 

ఆపిల్

బరువుని మెరుగుపరిచే మరొక ఆహారంగా ఆపిల్’ను చెప్పవచ్చు. ఆపిల్’ని ఎంచుకున్న వారి ఆహరంలో క్యాలోరీల సంఖ్య తక్కువ అని చెప్పవచ్చు. ఆపిల్స్ ఎక్కువగా యాంటీ-ఆక్సీడెంట్స్’ని కలిగి ఉండటం వలన జీవక్రియ రేటును తగ్గించి, కొవ్వు పదార్థాల స్థాయిలను కూడా తగ్గిస్తుంది. కావున రోజు తీసుకోనే జంక్ ఫుడ్ మరియు స్నాక్స్ తినటం మానేసి ఆకలి వేసినపుడు ఆపిల్’ని తినండి. కావున తాజా ఉండే పండ్లు మంచి ఫైబర్స్’ని కలిగి ఉండి, మీ ఆరోగ్యాన్ని కాపాడతాయని గుర్తుపెట్టుకొండి.

 

గుడ్లు

గుండ్రని ఆకారంలో ఉండే చిన్న గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రోటీన్’లను ఎక్కువగా కలిగి ఉన్న వీటితో రోజును ప్రారంభించటం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అల్పాహారంగా గుడ్లను తినండి. పూర్వికులు తెలిపిన విధంగా గ్రుడ్డులోని తెల్లని భాగమే మాత్రమే కాకుండా పూర్తి గుడ్డు ఆరోగ్యానికి మంచిది మరియు సగం కంటే ఎక్కువ ప్రోటీన్స్ గ్రుడ్డులోని పచ్చసొన నుండి వస్తాయి. ఈ పచ్చసొన ఎక్కువగా విటమిన్ ‘E’ని కలిగి ఉంటుంది.

 

కిడ్నీ బీన్స్

గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి అని అందరికి తెలుసు కానీ ఏ రకమైన గింజలు ఆరోగ్యానికి మంచివొ తెలుసా? రెడ్ బీన్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి 5 గ్రాముల కంటే ఎక్కువ ఫైబర్’లని శరీరానికి అందిస్తాయి. కిడ్నీబీన్స్ కూడా పిండి పదార్థాలను కలిగి ఉంటాయి మరియు ఒక సగం కప్పు కిడ్నీబీన్స్ 2 గ్రాముల కార్బోహైడ్రెట్స్’ని అందిస్తాయి.

 

అవకాడో

అవకాడో అనేది కొవ్వు పదార్థాలను కలిగి ఉంటుంది. కానీ ఇది బరువు తగ్గించటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎక్కువగా మోనోఅన్-సాచూరేటేడ్ ఫాట్’ని కలిగి ఉండటం వలన బరువు తగ్గించటలో సహయపడుతుంది. తినే సాండ్విచ్’లో రుచి కోసం వాడే క్రీమ్’కి బదులుగా ఈ అవకాడోని కలుపుకొండి. అవకాడో ఎక్కువ కాలోరిస్’ని కలిగి ఉండి, తినే ఆహారాన్ని ఆరోగ్యవంతగా మారుస్తుంది.

 

పైన పేర్కొన్న నియమాలని పాటిస్తూ, వీలైనంత ఎక్కువ నీటిని తాగుతూ, తగినంత సమయం విశ్రాంతి తీసుకోవటం వలన అధిక బరువుని సునాయాసంగా తగ్గించుకోవచ్చు

error: నమస్కారం!