Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

మాయ చేస్తారు కాబట్టే మీరు గౌరవనీయ ఏ-1 కాగలిగారు : లోకేష్

జగన్ అనే నేను అంటూ కోతల రాయుడుగారు ఎన్నికల ముందు ఏమేం కోతలు కోశారు, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను ఎలా కోతలకు గురి చేస్తున్నారో చూడండి అని నారా లోకేష్ విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే, అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1100 కోట్లు ఇస్తామని ఆనాడు చెప్పారని గుర్తు చేశారు. మరిప్పుడు ఐదు నెలల తర్వాత రూ.264 కోట్లు మాత్రమే ఇస్తామంటారేంటి? అని ప్రశ్నించారు.

 

అంటే కోతకు గురైన రూ.836 కోట్లను ఇంకో నెలలో ఇచ్చేసి మాట నిలబెట్టుకుంటారా? అయినా తెదేపా హయాంలోనే 6.49 లక్షల మందికి, రూ.336 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం చేసాం. వైసీపీ వేసిన కోర్టు కేసుల మూలంగా తెదేపా ఇవ్వలేకపోయిన ఆ రూ.336 కోట్ల నుండే రూ.264 కోట్లు ఇస్తూ ఇంకా రూ.72 కోట్లను మిగుల్చుకున్నారు. వాహ్! జగన్ మోహన్ రెడ్డి గారు! ఇంత మాయ చేస్తారు కాబట్టే మీరు గౌరవనీయ ఏ-1 కాగలిగారని తీవ్ర విమర్శలు చేశారు.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!