Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

‘జూనియర్ బాలయ్య’ గోకుల్ ఇక లేడు

జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ షోలో నందమూరి బాలకృష్ణగా మెప్పించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బాల నటుడు గోకుల్ సాయికృష్ణ డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. చిన్న వయసులోనే అచ్చం బాలయ్యలా డైలాగులు పలకడం, హావాభావాలు పలికించడంతో చాలా ఫేమస్ అయ్యాడు.

 

ఇప్పుడు గోకుల్ లేడని తెలియడంతో బాలయ్య తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మాకు అభిమానుల కంటే విలువైనది మరొకటి ఉండదు. అలాంటి చిన్నారి అభిమాని గోకుల్. నేనంటే ప్రాణం ఇచ్చే ఈ చిన్నారి ఈ రోజు ప్రాణాలతో లేడన్న నిజం నా మనసును కలచివేసింది. అతడు డైలాగులు చెప్పిన విధానం.. హావభావాలు చూసి నాకు ఎంతో ముచ్చటేసేది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి ఇంత చిన్న వయసులో డెంగ్యూ వ్యాధితో ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధ కలిగించింది. ఈ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అంటూ బాలయ్య ఒక సంతాప సందేశాన్ని విడుదల చేశారు.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!