Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

మంత్రి పదవి రాకపోవడంతో నా భర్తకు బీపీ ఎక్కువైంది: జోగు రామన్న భార్య

మంత్రి పదవుల కోసం ఆశ పెట్టుకొన్న టీఆర్ఎస్ ఎమ్మేల్యేలు బెర్తులు దక్కకపోవడంతో తమ నిరసనగళాన్ని విన్పిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న సోమవారం రాత్రి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో జోగు రామన్న భార్య రమ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తన భర్తకు మంత్రి పదవి రాకపోవడం బాధగా ఉందని అన్నారు. మంత్రి పదవి రాకపోవడంతో తన భర్తకు బీపీ ఎక్కువైందన్నారు. తన భర్త అజ్ఞాతంలోకి వెళ్లడం చాలా బాధ కల్గించందన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు తాము నడుచుకొంటామని ఆమె చెప్పారు. 2014 నుండి 2018 వరకు కేసీఆర్ మంత్రివర్గంలో జోగు రామన్న అటవీశాఖ మంత్రిగా పనిచేశారు.  అయితే ఆయన కుటుంబసభ్యులకు టచ్‌లోకి వచ్చినట్టు సమాచారం. అనారోగ్యం కారణంగానే తాను కార్యకర్తలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పారని సమాచారం.

 

 

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!