Subhodayam :

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

జియో సిమ్ వాడుతున్నారా? అయితే మీకో శుభవార్త

 

Jio increases ring time to 20 to 25 seconds

మీరు జియో సిమ్ తో అవతలివారికి ఫోన్ చేస్తే త్వరగా కట్ అయిపోయి వారికి మిస్డ్ కాల్ పడుతుందా? దీనికోసం జియో ఒక శుభవార్త చెప్పింది. అదేమిటంటే ఇప్పటివరకు 20 సెకన్లుగా ఉన్న జియో రింగ్ టైమ్ ఇప్పుడు 25 సెకన్లకు పెరిగింది. అంటే ఇక నుంచి మీరు ఎవరికైనా ఫోన్ చేస్తే అది 20 సెకన్లు కాకుండా 25 సెకండ్ల పాటు రింగ్ అవుతుంది. కేవలం 20 సెకన్ల పాటే మోగినట్లయితే మీ నెట్ వర్క్‌కు సంబంధించిన కాల్స్‌ను మా నెట్ వర్క్‌లో అనుమతించబోమని ఎయిర్ టెల్, జియో సంస్థను లేఖ ద్వారా హెచ్చరించింది. దీంతో జియో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఈ విషయాన్ని ట్రాయ్‌కి కూడా తెలియజేసింది.

 

ఇంటర్ కనెక్షన్ యూసేజ్ చార్జ్‌ని ప్రభావితం చేసేందుకే జియో రింగ్ సమయాన్ని తక్కువగా నిర్ణయించిందని ఎయిర్ టెల్ ఆరోపిస్తోంది. ఇంటర్ కనెక్షన్ యూసేజ్ చార్జ్‌ అనగా మీరు మీ నెట్ వర్క్ నుంచి వేరే నెట్ వర్క్‌కు కాల్ చేసినప్పుడు, మీ నెట్ వర్క్ వారికి చెల్లించవలసిన చార్జ్. రింగ్ టైమ్ తక్కువగా ఉండటం వల్ల కాల్ త్వరగా కట్ అయిపోతుందని, మిస్డ్ కాల్స్ జియో నుంచి ఎక్కువగా వస్తున్నాయని ఎయిర్ టెల్ వాదన. దాని కారణంగా మా సబ్ స్క్రైబర్లు తిరిగి కాల్ చేయాల్సి వస్తుందని, దీని కారణంగా తమకు నష్టం కలుగుతుందని ఆరోపిస్తోంది. అందుకే జియో ను లేఖ ద్వారా హెచ్చరించి రింగ్ టైం పెరిగేలా చేసింది. దీని ద్వారా ఎయిర్ టెల్ నెట్ వర్క్, జియో కష్టమర్లకు లాభం చేకూరనుంది.

Read More
error: నమస్కారం!