Subhodayam

Latest Telugu News | AP News in Telugu | Latest News in Telugu | Telangana News in Telugu | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

Jio Fiber : నేడే జియో ఫైబర్ ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి

టెలికామ్ రంగంలో సంచలనాలు సృష్టిస్తూ.. కస్టమర్లను పెంచుకుంటోన్న రిలియెన్స్ జియో నుంచి ఇప్పుడు బ్రాడ్‌బ్రాండ్, డీటీహెచ్ సేవలు వచ్చేస్తున్నాయి.నేడు రిలియెన్స్ జియో ఫైబర్ అధికారికంగా ప్రారంభం కాబోతుంది. ‘రిలయన్స్ జియో జిగాఫైబర్’ పేరుతో ఈ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. వాస్తవానికి గతేడాదే జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. 1600 పట్టణాల నుంచి 15 మిలియన్ రిజిస్ట్రేషన్స్ జరిగాయి. గత ఏడాదిగా 5 లక్షల ఇళ్లల్లో ప్రయోగాత్మకంగా గిగాఫైబర్ సేవలు అందుతున్నాయి.

 

ప్రీమియం వినియోగదారులకు జియో ప్లాన్‌ నెలకు రూ.700 నుంచి రూ. 10 వేల వరకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం జియో ఫైబర్ సేవలను ప్రీపెయిడ్ రూపంలో అందిస్తామని, భవిష్యత్‌లో పోస్ట్ పెయిడ్ సేవలనూ అందుబాటులోకి తెస్తామని జియో ఇటీవల తెలిపింది. జియో గిగాఫైబర్ కనెక్షన్ తీసుకున్నవారికి ఎంచుకున్న ప్లాన్‌ను బట్టి డేటా స్పీడ్ ఉంటుంది. ల్యాండ్‌లైన్ ఫోన్, జియో 4కే సెట్ టాప్ బాక్స్ ఉచితం. అంతేకాదు గిగాఫైబర్ యాన్యువల్ ప్లాన్ తీసుకున్నవారికి హెచ్‌డీ 4K ఎల్ఈడీ టీవీతో పాటు సెట్ టాప్ బాక్స్ ఉచితంగా లభించనుంది. ‘జియో ఫరెవర్ యాన్యువల్ ప్లాన్స్’ పేరుతో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే కేవలం ప్లాన్ ఛార్జీలు చెల్లిస్తే చాలు. హెచ్‌డీ 4K ఎల్ఈడీ టీవీ, సెట్ టాప్ బాక్స్ ఉచితం.

Advertisements

 

జియో ఫైబర్ కనెక్షన్ కావాలని కోరుకునే వారు వెబ్‌సైట్‌లో రిలయన్స్ జియో ఫైబర్ లింక్‌కు వెళ్లి, జియో ఫైబర్‌ కనెక్షన్‌ను యాక్సెస్ చేయదలిచిన చోట మీ చిరునామాను (ఇల్లు లేదా కార్యాలయం) పేర్కొనాలి. తరువాతి పేజీలో పేరు, మొబైల్ నంబర్ ఇమెయిల్ ఐడీ తదితర వివరాలను నమోదు చేయాలి. పేరు, అడ్రస్ నమోదు ప్రక్రియ ముగిశాక, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని సంబంధిత బాక్స్‌లో ఎంటర్‌ చేయాలి. ఓటీపీ నిర్ధారించాక జియో సేల్స్‌ ప్రతినిధికి జియో ఫైబర్‌ కనెక్షన్‌ పొందడానికి అవసరమైన పత్రాన్ని (ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్‌ల్లో ఒకటి) అందచేస్తే సరిపోతుంది. మరి మీరు కూడా జియో ఫైబర్ సేవలు పొందాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. జియో ఫైబర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

error: నమస్కారం!