Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

పోలీసులంటే చెయ్యెత్తి జైకొట్టేలా విధులు నిర్వహించాలి : సిఎం జగన్

Jagan at commemoration day in Vijayawada

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈరోజు ఉదయం విజయవాడ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సామాన్యుడు కూడా పోలీసులంటే చెయ్యెత్తి జైకొట్టేలా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు, గౌరవాన్ని పొందాలన్నారు.

 

రాష్ట్ర భద్రత కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు సెల్యూట్‌ చేస్తున్నా అని పేర్కొన్నారు. ఇక మెరుగైన పోలీసు వ్యవస్థ కోసం ప్రతీ పోలీసు సోదరసోదరీమణులు నిరంతరం కృషి చేయాలని జగన్‌ పేర్కొన్నారు. హోంగార్డు కూడా విధుల్లో ఉంటూ చనిపోతే రూ.5 లక్షల పరిహారం కుటుంబానికి అందజేస్తామని తెలిపారు.

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!